టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆత్మీయ భేటీ
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; తిరుమల కొండపై టాక్సీ డ్రైవర్లతో అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
టీటీడీ పరిధిలో వేలాది మంది భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న డ్రైవర్ల సేవలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వారి పని ఒత్తిడి, డ్యూటీ సమయాలు, విశ్రాంతి సౌకర్యాలు, ఆరోగ్య సమస్యలు, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీలో ఒకడిగా మీ సమస్యలు వినడానికి వచ్చాను. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. టీటీడీ బోర్డు, సంబంధిత మంత్రులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజాప్రతినిధిగా పొరుగు రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కూడా అండగా ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
