Disposal Team | బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు.

Disposal Team | బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు.

Disposal Team |

Disposal Team | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాలతో నూతన సంవత్సర సందర్భంగా జిల్లాలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు బస్టాండ్, ట్యాంక్ బాండ్, కలెక్టరేట్, RTC డిపో, కార్గో పార్సెల్ సర్వీస్, పార్కింగ్ ఏరియా ఇంకా రద్దిగా ఉండే అన్ని ఏరియాలలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బాంబ్ డిస్పోసల్ టీం(disposal team)తో విస్తృత తనిఖీలు(Extensive inspections) చేపట్టామని తెలిపారు.

ఈ సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా అడిషనల్ సీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.