మట్టి మనిషిని నేను..

  • పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే సామెల్
  • వేడుకలకు ఎంపీ వర్గం దూరం

మోత్కూర్, ఆంద్రప్రభ: తాను మట్టి మనిషినని, మాట తప్పని..మడమ తిప్పని నేతనని, ప్రజల కష్టాలు తెల్సిన ఉద్యమ నాయకుణ్ణి అని, తాను ఎల్లప్పుడూ సాదాసీదాగానే ఉంటూ ,నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సామెల్ పుట్టినరోజు వేడుకలు మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించగా ఎమ్మెల్యే సామెల్ స్వయంగా పాల్గొని తన పుట్టినరోజు కేక్ ను పార్టీ కార్యకర్తల మధ్య కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సామెల్ కి స్వాగతం పలికి గజమాల,పూలమాల లు,శాలువలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పుట్టిన తాను గత 25 ఏండ్లుగా తెలంగాణ ఉద్యమంలో పోరాడానని,ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు అందరిని కలుపుకుపోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, మండల ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ బాలరాజు గౌడ్,గుండగొని రామచంద్రు గౌడ్,జిల్లా కాంగ్రెస్ నాయకులు డా గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి, చింతల విజయ్ భాస్కర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి,పోచం జగన్, కౌన్సిలర్ పన్నాల శ్రీవిధ్య,గనగాని శైలజ నర్సయ్య,మండల ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం జయశ్రీ, అన్నెపు పద్మ,సింగిల్ విండో డైరెక్టర్ ఆకుల వెంకటేశ్వర్లు,చేనేత సంఘం అధ్యక్షుడు వంగరి రాములు,సర్పంచ్ అంతటి భగవంతు, నాయకులు బద్ధం నాగార్జున రెడ్డి, పురుగుల నర్సింహా,ఎడ్ల శ్రీనివాస్,బయ్యని రాజు,గుండా రాములు,పల్లపు దుర్గయ్య,సమ్మయ్య,బందెల రవి,సుంకిషాల అనిల్,ఉయ్యాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు ఎంపీ వర్గం దూరం…?

ఎమ్మెల్యే సామెల్ పుట్టినరోజు వేడుకలకు ఎంపీ చామల వర్గం దూరంగా ఉండడంతో ఇంకా ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య సయోధ్య కుదరలేదని పలువురు వాపోతున్నారు. ఈ వేడుకలకు స్థానిక ఓ పెద్ద నాయకునితో పాటు,మున్సిపల్ వైస్ చైర్మన్ ,కౌన్సిలర్లు ,ముఖ్య నాయకులు దూరంగా ఉండడంతో ఆయా వర్గాల మధ్య కుంపటి కాస్త కొట్టొచ్చినట్లు కనపడింది.