ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదు
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో ఉపాధి హామీ పథకంలో కొనసాగిన అక్రమాలపై సోమవారం నారాయణపేట కలెక్టరేట్ ప్రజావాణిలో బిజ్వార్ గ్రామానికి చెందిన సిద్దితోపాటు పలువురు ఫిర్యాదు చేశారు. ఉపాధి కోసం ముంబాయికి వలస వెళ్లిన కూలీల పేరుమీద ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమంగా హాజరు వేసి ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఆ డబ్బులు కూలీల వ్యక్తిగత ఖాతాలో జమ కావడంతో వాటిని ఎలాగైన ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ వలస వెళ్లిన బాధితులను బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు.
అకౌంట్ లో మీ పేరు మీద హాజరులు వేసి డబ్బులు వేయించాను ఆ డబ్బులు తీసి తనకు ఇవ్వాలని మహిళను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజావాణిలో ఇచ్చినటువంటి వినతి పత్రం తిరిగి ఎంపీడీవో ఆఫీస్ కి రావడంఏపీఓ ఈ సి బిజ్వార్ గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయగా ఆ ఎంక్వైరీలో భాగంగా ముంబై కి వలస వెళ్లిన పేర్ల పై మీరు హాజరులు వేసినారని ఫీల్డ్ అసిస్టెంట్ ని ఎపిఓ అడగగా ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ఒప్పుకున్న క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్, డి ఆర్ డి ఓ ఆదేశాల మేరకు బిజ్వార్ గ్రామంలో క్షేత్రస్థాయిలో ఎంక్వయిరీ చేసిన అధికారులు తప్పుడు నివేదిక సమర్పించడంతో మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్య తీసుకొని పక్షంలో తాము ఆందోళనలు చేపట్టడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
