నాగేంద్ర స్వామి పుట్ట వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని పొలాల మధ్య అనాదిగా పూజలు అందుకుంటున్న నాగేంద్ర స్వామి పుట్ట వద్ద సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి నాగదేవతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నాగదేవతను ప్రార్థించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
