ప్రతిభావంతులైన విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య హాస్టల్ ట్రస్ట్ బోర్డు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో నోటు పుస్తకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాగబండి మధుసూదన్, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, ఉప సర్పంచ్ గొట్టం విజయేందర్ రెడ్డి, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి, కౌడ ఆంజనేయులు, అంకం సంపత్, చరణ్, ఉపాధ్యాయులు, వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
