జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిలుపూర్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పేద ప్రజల సంక్షేమంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికవృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. విద్యా, వైద్య, సాగు నీటి రంగాలకు పెద్ద పీట వేయడంతోపాటు మహిళా, రైతు, పేద వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బలిదే వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, సురేష్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.