కొండా లక్ష్మణ్ సేవలు చిరస్మరణీయం
కొండా లక్ష్మణ్ సేవలు చిరస్మరణీయం
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) సేవలు చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) అన్నారు.
ఈ రోజు భూపాలపల్లి మంజూరునగర్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Rahul Sharma)తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలితరం ఉద్యమనాయకుడిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్త(politician)గా ఎంతో పేరు తెచ్చుకున్నబాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు.
బహుజన నేతగా పద్మశాలీ(Padmasali)ని సంఘటితం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని పేర్కొన్నారు.
కలెక్టరేట్ లో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
భూపాలపల్లి కలెక్టరేట్(Bhupalapally Collectorate)లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్‌తో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు.
