రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడెంలో ముస్లింల రంజాన్ పండుగ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌ బొజ్జు రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. కడెంలో పలువురు కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకుల ఇండ్లకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెళ్లి వారిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపి వారు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

వారి వెంట ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఏం మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు టి మల్లేష్ యాదవ్, షేక్ రఫీక్ వాజిద్ ఖాన్, బబ్లు, షర్ఫుద్దీన్, అంజత్, కొండాపురం లక్ష్మణ్, కాలీంచ‌ తరిగంగాధర్చ‌ జావిద్చ‌ తదితరులు పాల్గొన్నారు.