ఏటీసీకి ఈనెల 14 నుంచి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి

ఏటీసీకి ఈనెల 14 నుంచి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి
ప్రిన్సిపాల్ రాములు
జన్నారం, ఆంధ్రప్రభ : మండలంలోని ఏటీసీ, ఐటీఐలో ఉన్న సీట్ల భర్తీకి కోసం ఈ నెల 14 నుంచి వచ్చే నెల 8 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా జన్నారం ఏటీసీ,ఐటీఐ ప్రిన్సిపాల్ బి.రాములు మంగళవారం సాయంత్రం తెలిపారు.
ఏటీసీలో ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ( సంవత్సరం) 20, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్,ఆటో మిషన్ ( సంవత్సరం) 40, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (సంవత్సరం) 40, అడ్వాన్స్ సీఎన్ సీ మిషన్ టెక్నీషియన్ (రెండేళ్లు)24, బేసిక్ డిజైనర్, విరుచువల్ అనాలసిస్, డిజైన్ ఎఫ్ఈఎం (రెండేళ్లు) 24, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్(రెండేళ్లు) 24, ఐటీఐ లోని వెల్డర్ (ఏడాది) 20, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (ఏడాది) 48, డ్రెస్ మేకింగ్ (ఏడాది) 20 ఖాళీలు ఉన్నాయని ఆయన వివరించారు. దరఖాస్తుదారులు ఎస్ఎస్సి మెమో, కుల ధ్రువీకరణ,బోనఫైడ్, ఆధార్ కార్డు,మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్లతో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు పనివేళల్లో ఫోన్ నెంబర్లు 9676032186,8500466357,9989279834 సంప్రదించాలని ఆయన సూచించారు.
