ఘనంగా హనుమాన్ జయంతి శోభ యాత్ర
ఘనంగా హనుమాన్ జయంతి శోభ యాత్ర
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ శోభాయాత్రకు అధిక సంఖ్యలో హనుమాన్ స్వాములు , హిందూ బంధువులు, హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. స్వామి టెంపుల్ నుంచి దనసరి, ఉప్పరపల్లి రోడ్డు మీదుగా రైల్వే ఫ్లైఓవర్ పోలీస్ సెంటర్ నుంచి అమీనాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు నిర్వహించడం జరిగింది .
కార్యక్రమంలో శ్రీ భక్త అభయంజనేయస్వామి ప్రధాన అర్చకులు శ్రవణ్ కుమార్ ,గుడి కమిటీ సభ్యులు హనుమాన్ శోభయాత్ర కమిటీ సభ్యులు హనుమాన్ దీక్ష అధికారులు అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొనడం జరిగింది.
