ప్రతి అర్హుడు ఓటు నమోదు చేసుకోవాలి..
- మోమిన్‌పురలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో పాల్గొన్న బీఆర్ఎస్‌వీ నాయకులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా తన ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని అదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్, వార్డు సభ్యుడు సౌకత్ అలీ పిలుపునిచ్చారు.
శనివారం ఉట్నూర్ పట్టణంలోని మోమిన్‌పుర వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను ప్రజలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)కు అందజేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
యువతతో పాటు అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ ఇమ్రాన్, బీఎల్‌ఏ జావేద్, జగదీశ్, అయాన్, రాజ్‌కుమార్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
