పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి..

  • ఐదుగురు అరెస్ట్..
  • రూ.11,230 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గంగాయిపల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.11,230 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాయిపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఇటిక్యాల రేవంత్‌రెడ్డి, బానోత్ కంద్యా, నల్ల పేరమాన్లు, జిట్ట సత్యనారాయణ, ఎ. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,230 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.