References | గుర్తు తెలియని మృతదేహం లభ్యం…

References | గుర్తు తెలియని మృతదేహం లభ్యం…
References | బాసర, ఆంధ్రప్రభ : బాసర గోదావరి నదిలో ఇవాళ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. సిఐ సాయికుమార్(CI Saikumar) తెలిపిన వివరాల మేరకు… స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గజ ఈతగాలతో మృతదేహాన్ని వెలికి తీయించగా.. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు(evidence) లభించలేదని, మృతుడు (40) నల్లని షర్ట్, నల్లని కార్గో ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
