Minister | సర్పంచ్ పదవికి పెరుగుతున్న పోటీ

Minister | సర్పంచ్ పదవికి పెరుగుతున్న పోటీ

Minister | మహా ముత్తారం, ఆంధ్రప్రభ : మూడో విడతలో జరగనున్న స్థానిక సమరంలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఈ ఎన్నికలు జరుగుతుండటంతో అభ్యర్థులు పరోక్షంగా పార్టీల మద్దతుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీ నుండి పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు.

సాధారణంగా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో నిలుస్తారు కాని ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ… తమ పార్టీ నుండి సర్పంచి అభ్యర్థులు ఒకరే నిలుస్తారని చెప్పడంతో ప్రాధాన్యత సంచరించుకుంది.

ఈ విషయం సోషల్ మీడియా(Social Media)లో చెక్కర్లు కొడుతోంద‌న్నారు. ఎవరెవరు గ్రామాల్లో ఎలాంటి సాయం చేస్తున్నారో అనే అంశంపై నిరంతరం వాట్సప్ గ్రూపులో చర్చలు కొనసాగుతాయ‌న్నారు. దీంతో ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంద‌ని అన్నారు. ఏది ఏమైనా ప్రజా సేవ నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నవారికి తమ ఓటు వేస్తామంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply