Encounter | రేవంత్ జీ.. మీ సోనియా, రాహుల్ కులం ఏమిటి ? – బండి

హైదరాబాద్ – ప్ర‌ధాని మోదీ కుల ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చిన సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కౌంట‌ర్ ఇచ్చారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, సోనియా, రాహుల్ కులాలపై బండి సంజయ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. రాహుల్ ది ఏ కులం? ఏ మతం? ఏ దేశం ? దీనిపై 10 జనపథ్ లో చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. సోనియా క్రిస్టియన్, ఇటలీ దేశస్తురాలు… రాహుల్ గాంధీ ది ఏ కులమని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.


రాహుల్ కి కులం , మతం , దేశం , జాతి లేదు.. రేవంత్ దీనికేం సమాధానం ఇస్తారు.? అంటూ నిలదీశారు. ఇలాంటివి మాట్లాడి కొరివితో రేవంత్ తల గోకొంటున్నార‌ని మండిప‌డ్డారు.. ఎమ్మెల్సీ ఎన్నికలను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నార‌ని ఆగ్రహించారు. ప్ర‌ధాని మోడీని బీసీగా దేశమంతా గుర్తించింద‌ని అన్నారు బండి. ముస్లిం లను బీసీ లో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు. కుల గణన పై కేంద్రం నింద వేసే కుట్ర చేస్తున్నార‌ని, కాంగ్రెస్ ఆట‌లు సాగ‌నివ్వ‌బోమ‌ని వార్నింగ్ ఇచ్చారు…

Leave a Reply