Bike Rally | అవకాశం మరో సారి ఇవ్వాలి…
Bike Rally | కోటగిరి, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(Nomination Process)కు తన స్వగృహం నుండి భారీ బైక్ ర్యాలీ(Bike Rally)తో ఉత్సాహంగా ప్రారంభమైంది. కోటగిరి గ్రామానికి చెందిన పత్తి లక్ష్మణ్ సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను గ్రామస్థులతో కలసి పంచాయతీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో దాఖలు అందజేశారు.
నామినేషన్ సమర్పించిన అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసమైన మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారి వెంటనే ఉంటూ వారిలో ఒకడినై గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పడతానని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ మరింత అభివృద్ధి చేసే అవకాశం మరో సారి ఇవ్వాలని ఆయన కోరారు. ఆయన వెంట కూచి సిద్దు, అనిల్ కులకర్ణి, కాపుగాండ్ల శ్రీనివాస్, బర్ల సాయిలు, ఉదయ్ భాస్కర్, శ్రీధర్ గ్రామస్తులు ఉన్నారు.

