Minister | మృతుని కుటుంబానికి అండ‌గా..

Minister | మృతుని కుటుంబానికి అండ‌గా..

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం, దేవునాల్తాడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు గోపాలరావు ప్రమాదవ వశాత్తు చేపల వేటకు వెళ్లి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Kinjarapu Atchannaidu) ప్రత్యేక చొరవతో మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, కార్మిక శాఖ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Minister | మత్స్యకారుని కుటుంబానికి రూ.10 లక్షల సాయం

Minister |

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని మత్స్యశాఖ(Fisheries Department) అధికారులను మంత్రి ఆదేశించారు. కుటుంబంలోని పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి భరోసా ఇస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సాయం మంజూరు చేయడం వల్ల మృతుడి కుటుంబానికి తక్షణ భరోసా లభించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Minister | మత్స్యకారుని మృతిపై విచారం..

Minister |

వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ తీరంలో సముద్రంలో బోటు బోల్తా ఘటన దురష్టకరమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మత్స్యకారుడు గోపాలరావు మృతి నన్ను కలచివేసిందన్నారు. క్షేమంగా ఒడ్డుకు చేరిన నలుగురు మత్స్యకారుల(Fishermen’s Affairs)కు పూర్తి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. వేట సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరారు.

Minister |

CLICK HERE TO READ MORE : R.K.Roja | ఏపీ పోలీసులు సిగ్గుపడాలి…

CLICK HERE TO READ MORE :

Leave a Reply