Bheemgal | విజయవంతంగా ముగిసిన ఉర్సు ఉత్సవాలు

Bheemgal | విజయవంతంగా ముగిసిన ఉర్సు ఉత్సవాలు
- దర్గాకు కానుకగా చాదర్ ను సమర్పించిన దర్గా కమిటీ నిర్వాహకులు
Bheemgal | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి నుండి మంగళవారం రోజు వరకు హజరత్ సయ్యద్ షేక్ నత్తర్ షా వలి అబ్దాల్ పవ సైలాన్ రహమతుల్లా అలే దర్గా వద్ద ఉరుసు ఉత్సవాలను దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి విజయవంతం చేశారు. దర్గా ఉత్సవాలను మూడు రోజులు ఘనంగా దర్గా కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.

మొదటిరోజు గుసూల్ షరీఫ్, రెండో రోజు సందల్ షరీఫ్, మూడోరోజు దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. గత పురాతమైన దర్గా ఉత్సవాలను 875 సంవత్సరాల నుండి ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… దర్గా ఉర్సు ఉత్సవానికి వచ్చే భక్తులు వారు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయని నమ్మకంతో ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు హాజరై కుల మతాలకు తేడా లేకుండా మొక్కులు చెల్లించుకుంటారు. ఉర్సు ఉత్సవాలు చూడడానికి వచ్చే భక్తులకు దర్గా కమిటీ సభ్యులు విన్యాసాలను కూడా నిర్వహించారు. అలాగే ఉత్సవాలకు వచ్చే ప్రజలకు దర్గా కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ ఉర్సు ఉత్సవానికి మండలంతో పాటు వివిధ గ్రామాలు, అలాగే ఇతర జిల్లాల నుండి.. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంఏ. సమీర్, మాజీ జెడ్పి కో-ఆప్షన్ నెంబర్ మొయిజ్, దర్గా కమిటీ నిర్వాహకులు జావీద్, సలాం, ఖాదీమ్ సయ్యద్ షబ్బీర్ అలీ, మస్తాన్, జావీద్, అలీమ్, ముజీబ్, సయ్యద్ జోహేబ్ చీష్టి, ముఖేమ్,సభ్యులు సయ్యద్ అత్తరుద్దీన్ రిపోర్టర్, జిశాన్, తాబేజ్, హసీఫ్ ఖురేషి, జుబేర్, అజర్, అన్వార్, మొహమ్మద్ ఫైజ్, రెహాన్, సోహెల్అలీ, సయ్యద్ అజ్మత్, మొహమ్మద్ నదీమ్, హసీఫ్ బెగ్, తదితరులు పాల్గొన్నారు.


