Bheemgal కుటుంబ భద్రతకు కేంద్ర పథకం చెక్కుల పంపిణీ

Bheemgal కుటుంబ భద్రతకు కేంద్ర పథకం చెక్కుల పంపిణీ


భీమ్‌గల్ రూరల్ (Bheemgal), ఆంధ్రప్రభ: కుటుంబ పోషణలో ప్రధాన ఆధారమైన వ్యక్తిని కోల్పోయిన నిస్సహాయ కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) ద్వారా మంజూరైన చెక్కులను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, మండలంలోని బాబాపూర్, జాగిర్యాల్, బెజ్జోరా గ్రామాలకు చెందిన నాలుగు మందికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలిపారు. గురువారం జాగిర్యాల్ గ్రామానికి చెందిన ఇద్దరు, బాబాపూర్‌కు చెందిన ఒకరు, బెజ్జోరాకు చెందిన ఒక మహిళకు చెక్కులను అందజేశారు.

కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడే పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల కుటుంబ యజమాని మరణించినప్పుడు మహిళలకు ఈ పథకం ద్వారా సహాయం అందుతుందని ఆయన వివరించారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎం.ఏ. సమీర్, గడాల ప్రసాద్, మేసా కార్తీక్, ఉపసర్పంచ్ మంద గోవర్ధన్, ఎంపీడీవో కంప్యూటర్ ఆపరేటర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply