భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : పౌర్ణమి పురస్కరించుకొని స్థానిక శ్రీశ్రీశ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు .అదేవిధంగా సుమారు 100 మంది పైగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగింది.

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ కమిటీ వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సదుపాయాలతో పూజా కార్యక్రమాలు , తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సందగిరి భూమారెడ్డి , ప్రధాన కార్యదర్శి మైలారం నారాయణరెడ్డి కోశాధికారి నూకల నారాయణ శెట్టి, వైస్ ప్రెసిడెంట్ రేగుంట గణేష్, ఆలయ ప్రధాన అర్చకులు హరీష్ శర్మ,జితేందర్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply