శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
జుక్కల్,ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రామాలయంలో శ్రీ రామనవమి సందర్భంగా మొదటి రోజు శ్రీ రాముని జన్మోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి.ఈ భక్తి కార్యక్రమానికి పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వెండి ఉయ్యాలలో కొలువుదీరిన బాల రామునికి దర్శించుకోవడమే కాకుండా, వెండిఉయ్యాలను ఊపి నామకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామాలయంలో ప్రత్యేక ప్రజలు చేసిన మాజీ ఎమ్మెల్యే షిండేకు మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహరాజ్ ఆశీర్వదించారు.ఈ భక్తి కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు సైతం పాల్గొనడం జరిగింది.
