Maruti | 39 వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ..

Maruti | 39 వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ..

Maruti, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti suzuki) 39, 506 గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. వ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ లో లోపం కారణంగా ఈ రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ మధ్య తయారైన కార్లలో ఈ లోపాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ బ్యాచ్ లో ఉత్పత్తి అయిన కొన్ని కార్లలో స్పీడో మీటర్ అసెంబ్లీలో వ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సరిగా పని చేయడం లేదని గుర్తించినట్టు తెలిపింది.

దీని వల్ల వ్యూయల్ స్టేటస్ అస్పష్టంగా చూపిస్తున్నట్టు కంపెనీ దృష్టికి వచ్చిందని మారుతీ సుజుకి (Maruti suzuki) తెలిపింది. ఈ లోపాలను సరిచేసేందుకు రీకాల్ చేస్తున్నామని దీనికి సంబంధించిన సమాచారం ఆయా డీలర్ల నుంచి కార్ల యాజమానులకు అందుతుందని పేర్కొంది. ఇలా రీకాల్ చేస్తున్న కార్లను పరిశీలించి ఆయా పార్టులను ఉచితంగా రీప్లేస్ చేస్తామని తెలిపింది. అక్టోబర్ నెలలో మారుతీ సుజుకి రికార్డ్ స్థాయిలో 2.20 లక్షల వాహనాలను విక్రయించింది. జీఎస్టీ తగ్గడంతో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.