HYDRA | సీఎం గారూ.. కంటి పరీక్ష చేయించుకోండి!
చెరువును కబ్జా చేసి నిర్మించిన కాలేజీ కనిపించడం లేదా..?
హైడ్రా చర్యలపై రేవంత్ సర్కార్ను లక్ష్యంగా కవిత ఫైర్
ఒవైసీ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపణ
హైడ్రా పేరుతో పేదలపై చర్యలు.. పెద్ద సంస్థలపై మౌనమంటూ విమర్శ
చెరువు ఆక్రమణలపై అందరికీ ఒకే న్యాయం ఉండాలని డిమాండ్
HYDRA | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హైదరాబాద్లో హైడ్రా చేపడుతున్న ఆక్రమణల తొలగింపు చర్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్లోని పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న ప్రభుత్వం, ఒవైసీకి చెందిన విద్యాసంస్థలను మాత్రం కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, ఒవైసీ విద్యాసంస్థల వ్యవహారంలో ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. చెరువు భూమిని ఆక్రమించి నిర్మించిన కళాశాల ప్రపంచానికి కనిపిస్తోందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే అది కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. “చెరువును కబ్జా చేసి నిర్మించిన కాలేజీ కనిపించకపోతే ముఖ్యమంత్రి వెంటనే కంటి పరీక్ష చేయించుకోవాల్సిందే” అంటూ కవిత ఎద్దేవా చేశారు. హైడ్రా చర్యల్లో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించిన ఆమె, ఆక్రమణల విషయంలో పేదలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిపైనా ఒకే విధంగా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
