NEWS@ 2:00 P.M | 10 జూలై 2026 ముఖ్యాంశాలు

Karur | క‌రూర్ ఘ‌ట‌న‌లో రాజ‌కీయ కుట్ర..

Karur |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కరూర్‌లో నిర్వహించిన సభలో తమిళనాడు సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన తన జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని పేర్కొంటూ, ఆ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. click here to read full news

Kavitha Manuguru Visit | కవిత మణుగూరు పర్యటన ఉద్రిక్తం

Kavitha Manuguru Visit |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శుక్రవారం టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణుగూరులోని పీకే ఓసీపీ–2 (PK OCP-2) గనిని సందర్శించేందుకు వెళ్లిన కవితను పోలీసులు అడ్డుకున్నారు. గని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. click here to read full news

Fish Market | కోహెడలో చేపల మెగా మార్కెట్

Fish Market | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా కోహెడలో దేశంలోనే తొలి అంతర్గత ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆధునిక మార్కెట్‌కు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. click here to read full news

world-economy | పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. అమెరికా వ్యూహం ఏమిటి?.. ట్రంప్ హత్య కుట్ర ఆరోపణలతో కొత్త మలుపు

ఆంధ్రప్రభ వెబ్‌, అంతర్జాతీయ ప్రతినిధి: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్తవి కావు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, వ్యూహాత్మక, సైనిక విభేదాలు ఇప్పుడు ప్రత్యక్ష ఘర్షణల దశకు చేరుకోవడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు పరిమిత సైనిక దాడులతో ఇరు దేశాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా మరోసారి యుద్ధ అంచున నిలిచింది. click here to read full news

Car Crash | నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు..

Car Crash | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటుడు ధర్మ నివాసం దెబ్బతింది. అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఆయన ఇంటి గేటు, ప్రహారీ గోడను ఢీకొట్టి ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. click here to read full news

Cyber Fraud | ఓటీపీ చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక

Cyber Fraud |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న అవగాహనను ఆసరాగా చేసుకుని బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దోచుకునేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరించారు. click here to read full news

Gold Rate Today-1.68L | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం రూ.1.68 లక్షలు దాటింది

Gold Rate Today-1.68L | ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్ర‌తినిధి : బంగారం కొనాలని భావిస్తున్న వారికి మరోసారి షాక్ తగిలింది. జూలై 10 (శుక్రవారం) దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. click here to read full news

Telangana news | మూడో ప్లాట్‌ఫాంపై విషాద ఘటన..

Telangana news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ నవజాత మగ పసికందును రైల్వే స్టేషన్ మూడో ప్లాట్‌ఫాం సమీపంలోని డ్రైనేజీ కాలువలో వదిలేసి వెళ్లిపోయింది. click here to read full news

Dec-12-Big-Bash : భారత్​ లో బిగ్​ బ్యాష్​ లీగ్​ Andhra Ptrabha Sports Story

 ఆంధ్రప్రభ, మెల్​ బోర్న్​ ప్రతినిధి : Dec-12-Big-Bash : భారత్​ నేలపై ఆటల సందడికి ఆస్ట్రేలియా సన్న్దధం అవుతోంది. భారత్​ చైన్నలో వారం రోజుల పాటు ఆటపాటలతో క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ, ‘బిగ్ బాష్ లీగ్’ (T-20 టోర్నమెంట్) రాబోయే సీజన్ ప్రారంభ మ్యాచ్ భారత్‌లో జరుగుతుందని తెలిపారు. దీనితో బిగ్ బాష్ లీగ్ తొలిసారిగా భారత్‌కు రానుంది. click here to read full news