90-Umrah-Pilgrims : చలో చలో ఉమ్రా Andhra Prabha Top News
90-Umrah-Pilgrims : చలో చలో ఉమ్రా Andhra Prabha Top News
- విజయవాడలో ముస్లీంల సందడి
- కూటమి నేతల ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు
- జెండా ఊపి హజ్ కమిటీ చైర్మన్ ప్రారంభం
( ఆంధ్రప్రభ, విజయవాడ )

90-Umrah-Pilgrims : విజయవాడ నుంచి 90 మంది ఉమ్రా యాత్రికులు మక్కా పుణ్యయాత్రకు బయలుదేరారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా జెండా ఊపి ప్రారంభించగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరుల ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.విజయవాడ వించిపేట నుంచి మహమ్మదీయ హజ్ ఉమ్రా సర్వీసెస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉమ్రా మక్కా యాత్ర కోసం బయలుదేరిన 90 మంది ఉమ్రా యాత్రకుల బస్సును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రులు నారా లోకేష్, ఎం ఎన్ డి ఫరూక్ లు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొని ఉమ్రా యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.జీవితంలో ఒక సారి ముస్లిం అందరూ పవిత్ర హజ్ యాత్ర చేయడం ముఖ్యమని , ఉమ్రా యాత్ర ఎన్నిసార్లు అయినా వెళ్ళ వచ్చని ,పవిత్ర మక్కా యాత్ర వెళ్లడం అనేది ఎంతో గొప్ప విషయమని ప్రతి ముస్లిం మక్కాకు మదీనాకు వెళ్లడం అదృష్టంగా భావిస్తారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు తెలియజేశారు . విజయవాడ నుండి వెళ్ళే వారికి రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రకు లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తుందని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.
