రేపు జన్నారం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
33/11 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జన్నారం ఇన్చార్జి ఏఈ సాయి శృతిక్ వెల్లడించారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
