ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తులరద్దీ

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తులరద్దీ

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులకు తోడు వారాంతపు సెలవులు రావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి చేరుకుంటున్నారు. పెరిగిన భక్తులసంఖ్యతో ఇంద్రకీలాద్రిపై రద్దీ నెలకొంది. ఉదయం 9 నుండే 500/- దర్శనం టికెట్ల అమ్మకాలు నిలుపుదల చేసి, అంతరాలయ దర్శనం పూర్తి స్థాయిలో నియంత్రణ చేశారు.

ఆలయ సిబ్బంది భక్తుల రద్దీ క్రమబద్దీకరణ చేశారు. వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ పరిస్థితి గమనించి భక్తులందరికి శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలనే ధ్యేయంతో దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. దేవస్థానం ఆధ్వర్యంలోసేవకుల ద్వారా మంచి నీరు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి మరింత పెరిగిన నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి విఐపి ప్రోటోకాల్ దర్శనానికి కాస్త సమయం బ్రేక్ ఇచ్చారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నీటి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి హాల్ టికెట్ ను చూపించి ప్రార్థించారు.

Leave a Reply