దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ..
దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ..
- కేడీసీసీ బ్యాంక్ చలివేంద్రం ప్రారంభం
- ప్రారంభించిన చైర్మన్ నెట్టెం రఘు రామ్
ఆంధ్రప్రభ, విజయవాడ ; వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం బ్యాంక్ ధ్యేయమని తెలిపారు.

వేసవి కాలంలో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడకుండా చలివేంద్రాల ఏర్పాటు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కేడీసీసీ బ్యాంక్ రైతులు, మహిళలు, గ్రామీణాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా అదే దిశలో కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జనరల్ మేనేజర్ రంగబాబు బ్రాంచ్ మేనేజర్ జి సోమయ్య ఇతర ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

