దువాతో ప్రారంభమైన బక్రీద్ వేడుకలు..

దువాతో ప్రారంభమైన బక్రీద్ వేడుకలు..

ముస్తాబైన మసీదులు, ఈద్గాహ్‌లు

త్యాగానికి ప్రతీకగా ఈద్ ఉల్ అజాహ్.. ఎ.కొండూరులో భక్తిశ్రద్ధల వాతావరణం

ఎ.కొండూరు – ఆంధ్రప్రభ : త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈద్ ఉల్ అజాహ్ (బక్రీద్) పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బక్రీద్ సందర్భంగా చిన్నారులు దువా చేస్తూ కనిపించారు. గ్రామాల్లో మసీదులు, ఈద్గాహ్‌లు పండుగ శోభతో ముస్తాబయ్యాయి.

జిల్ హజ్ నెలలో చంద్ర దర్శనం అనంతరం పదవ రోజున జరుపుకునే ఈ పర్వదినాన్ని మానవతా విలువలకు ప్రతీకగా భావిస్తారు. పేశ్ ఇమామ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ శాంతి, ఐక్యత, సోదరభావానికి సంబంధించిన సందేశాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా హజరత్ ఇబ్రహీం (అలైహి వసలాం) త్యాగాన్ని స్మరించుకుంటూ, అల్లాహ్‌పై విశ్వాసం, సమర్పణ భావాన్ని గుర్తుచేసుకుంటున్నారు. త్యాగానికి అర్థాన్ని చాటే ఈ పండుగ ద్వారా దానధర్మాలు, పేదల పట్ల సహానుభూతి పెంపొందాలని మత పెద్దలు సూచిస్తున్నారు.

పండుగ సందర్భంగా ప్రార్థనల అనంతరం ఆర్థిక స్థోమత కలిగిన వారు ఖుర్బానీ సంప్రదాయాన్ని పాటిస్తూ దానగుణాన్ని ప్రదర్శించనున్నారు. ఈనెల 28న గురువారం బక్రీద్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోనున్నారు.

Leave a Reply