టీడీపీ నేత రాజేష్ కు కనపర్తి పరామర్శ..!

టీడీపీ నేత రాజేష్ కు కనపర్తి పరామర్శ..!

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండల ఐ టీడీపీ కన్వీనర్, మాజీ తెలుగు యువత అధ్యక్షులు వేములపల్లి రాజేష్ మాతృమూర్తి మాధురి(68) ఇటీవల మృతి చెందారు. మంగళవారం టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు రాజేష్ స్వగృహం వద్ద మాధురి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, టౌన్ పార్టీ అధ్యక్షులు పూత బోయిన శ్రీనివాసరావు, పిఎసిఎస్ అధ్యక్షులు బొలిశెట్టి విఠల రావు, నీటి సంఘ అధ్యక్షులు అప్పికట్ల రవీంద్ర,పిల్లి మల్లికార్జున రావు, కాగిత ప్రసాద్ , బండే రాఘవ,వేములపల్లి శ్రీ కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply