భక్తులకు మెరుగైన సౌకర్యాలు

  • నాణ్యమైన ప్రసాదం అన్నదానం…
  • దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు దుర్గగుడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు పేర్కొన్నారు.. భక్తుల కోసం అన్ని సదుపాయాలు సౌకర్యాలు అందిస్తున్నామన్న ఆయన నాణ్యమైన ప్రసాదంతో పాటు, నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంద్ర కీలాద్రిపై ఉన్న పలు ప్రాంతాలలో పర్యటించిన ఆయన భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రసాదాల పంపిణీ, భక్తులకు అందుతున్న సౌకర్యాలు అన్న ప్రసాదం వంటి ప్రాంతాలను పరిశీలించిన ఆయన భక్తుల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

వైభవంగా పల్లకీ సేవ
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే పల్లకీ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు.. స్వామివారిని అమ్మవారిని పల్లకిపై ఊరేగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన పల్లకి సేవలో ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పల్లకిని మోసారు.