భర్త అదృశ్యం.. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కాటమయ్య కాలనీకి చెందిన కారింగుల జగదీష్ (34) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన జగదీష్ ప్రస్తుతం చౌటుప్పల్లోని కాటమయ్య కాలనీలో నివాసముంటూ, స్థానిక సైమన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
రాత్రి వరకు ఇంటికి చేరుకోకపోవడంతో భార్య కారింగుల మౌనిక బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.
