MARKET | వ్యవసాయ మార్కెట్లో అమ్మకాలు ఇలా..
MARKET | ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ : జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) పరిధిలో ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదివారం విడుదల చేసిన ధరల ప్రకారం పంటల వ్యాపారం చురుగ్గా కొనసాగింది. మొత్తం 185 లాట్లలో 2,282 సంచులు, సుమారు 892 క్వింటాళ్ల పంటలు అమ్మకానికి వచ్చాయి. వేరు శనగకాయలుకు మంచి డిమాండ్ ఉండగా, కనిష్ట ధర రూ.3,316, మధ్య (మోడల్) ధర రూ.5,170, గరిష్ట ధర రూ.6,620 నమోదైంది. మొత్తం 55 లాట్లలో 1,247 సంచులు వచ్చాయి.
ఆముదాలు విభాగంలో వర్తకం అత్యధికంగా నమోదైంది. మొత్తం 129 లాట్లలో 1,032 సంచులు, 516 క్వింటాళ్లు మార్కెట్కు చేరగా, కనిష్ట ధర రూ.5,059, మధ్య ధర రూ.5,787, గరిష్ట ధర రూ.5,805 నమోదయ్యాయి. కందులు విభాగంలో తక్కువ వర్తకం కనిపించింది. కేవలం ఒక లాట్, మూడు సంచులు మాత్రమే వచ్చిన ఈ పంటకు కనిష్ట, మధ్య, గరిష్ట ధర ఒకేలా రూ.5,553గా నమోదు అయ్యాయి. మొత్తం మీద ఈ.. ఎన్ఏఎం ద్వారా వర్తకం పారదర్శకంగా, రైతులకు అనుకూలంగా సాగుతోందని మార్కెట్ అధికారులు తెలిపారు.
