Maheshbabu | సెట్‌లో సెల్‌కు దూరంగా మహేశ్‌బాబు!

Maheshbabu | సెట్‌లో సెల్‌కు దూరంగా మహేశ్‌బాబు!
- Maheshbabu | ఈవెంట్‌లో చెప్పిన రాజమౌళి
Hyderabad | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఒక సినిమా ఈవెంట్ కు ఎందరో అభిమానులు వస్తారు. ఆ సందర్భంగా తమ అభిమాన హీరో కోసం చెప్పిన మాటలు చక్కగా వింటారు. అలాగే కొన్ని పాటిస్తారు కూడా. నిన్న జరిగిన ఈ వెంట్‌లో ఎన్నో గుడ్ మెసెజ్‌లు అభిమానులు చెంతకు చేరాయి. రామోజిఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ globetrotter పేరుతో జరిగిన వారణాసి సినిమా ఈవెంట్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ప్రధానంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరో ప్రిన్స్ మహేశ్‌బాబు(Hero Prince Mahesh Babu) కోసం దర్శకుడు రాజమౌళి చెప్పిన ఒక విషయం యువత తలకెక్కించుకుంటే మంచిదే. మహేశ్‌బాబు కోసం దర్శకుడు రాజమౌళి చెప్పిన మాటలు… మహేశ్‌బాబు… చాలా బిజీ పర్సన్.. అలాగే ఎన్నో సామాజిక మాద్యమాలు చూస్తుంటారు.. పోస్టులు కూడా పెడుతుంటారు.. అయితే ఆయన నిత్యం ఫోన్‌లో ఉంటారని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఆయన ఒకసారి సెట్టులోకి వస్తే కారులో సెల్ ఫోన్(cell phone) విడిచిపెట్టారు. ఎన్ని గంటలు పాటు సెట్‌లో ఉన్నా అన్ని గంటలు సెల్ ఫోన్‌కు దూరంగా ఉంటారు. షూటింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ కారు ఎక్కినప్పుడు సెల్ చూస్తారు. ఇది ఒక మంచి అలవాటు!
నిజమే ఈ విషయాన్ని మహేశ్‌బాబు అభిమానులు ఆదర్శంగా తీసుకుంటారా? అలాగే యువత కూడా పాటిస్తారా? అనేది ప్రస్తుత చర్చనీయాంశం. సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత సెల్‌ఫోన్ మానవ జీవితంలో ఒక భాగమైపోయింది. సెల్ ఫోన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దుష్ర్పయోజనాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం యువత ఒక పది నిమిషాలు సెల్‌ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో ఉన్నారు.
డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చూసే పరిస్థితి, అలాగే మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, చివరకు ఎక్స్‌కలేటర్(escalator)లో ఉన్నప్పుడు కూడా రీల్స్ చూస్తున్నారు. ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడి తమ విధులను ఎగ్గొట్టే ఉద్యోగులు ఎందరో ఉన్నారు. ఇలా సెల్‌ఫోన్‌తో ఉన్న దుష్ఫలితాలు లేకపోలేదు. పరిమితింగా వినియోగిస్తే సెల్ ఫోన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. డ్యూటీలో ఉన్నప్పుడు, డ్రైవింగ్(driving) చేస్తున్నప్పుడు సెల్ ఫోన్‌కు దూరంగా ఉంటే మంచిది! ఎంత మంది యువత సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటారు చూద్దాం!
