market | గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకోవాలి….
market | గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకోవాలి….
- మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు
market | ఉట్నూర్ / జైనూర్, ఆంధ్రప్రభ : రైతులుఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించి ప్రభుత్వ నిర్ణీత గిట్టుబాటు ధర ను సద్వినియోగం చేసుకోవాలని జైనూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు. సోమవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగపూర్ గ్రామంలో ప్రభుత్వ మార్కపెడ్ ఆధ్వర్యంలో ప్రజామిత్ర సహకారంతో ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాన్ని స్వచంద సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.రైతులు పండించే పంట ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలనే సదాశయంతో ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాణోత్ జైవంత్ రావు,నాపెడ్ ప్రతినిధి కుమర విఠల్ రావు, ప్రజా మిత్ర కో ఆర్డినేటర్ రాథోడ్ శేషారావు, డైరెక్టర్ రాధ,మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
