మారనున్న బాసర ఆలయ రూపురేఖలు..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర అమ్మవారి ఆలయ రూపురేఖలు మారనున్నాయి. బాసర ఆలయాన్ని భవ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు దాత ముందుకు రావడంతో ఆదివారం దాత సురపనేని సునంద్ పద్మప్రియ దంపతుల చేతుల మీదుగా భూమి పూజ చేసి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం దాత సంతోషం..

గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతకు సహకారం అందలేదు. ఈ సంవత్సరం దాతకు ఆలయ పున్ననిర్మాణంలో భాగస్వామ్యం కావడంతో సంతోషం వెలిబుచ్చారు. సుమారు 30 కోట్లకు పైగా అంచనా తో బాసర గర్భాలయం, మహంకాళి అమ్మవారి ఆలయం, శివాలయాలయం ను కృష్ణశిల తో నిర్మించనున్నారు. పుష్కరాల కంటే ముందే అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మహాకాళి శివాలయాన్ని పూర్తి చేయనున్నట్లు ఆలయ నిర్మాణ దాత సురపనేని సునంద్ అన్నారు.