Manthani ఈదురుగాలుల బీభత్సం..

Manthani ఈదురుగాలుల బీభత్సం..

కూలిన ఇండ్లపై కప్పులు, లేచిపోయిన రేకులు
మంథనిలో ఒక్కసారిగా దూసుకొచ్చిన గాలులు.. గ్రామాల్లో నష్టం

మంథని రూరల్‌ ( Manthani), ఆంధ్రప్రభ:

మంథని పట్టణం, మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా భారీగా వీచిన గాలుల ప్రభావంతో ఇళ్లపై కప్పులు, హోటళ్లపై రేకులు లేచి కింద పడిపోయాయి. పట్టణంలోని పలు హోటళ్ల పైకప్పులు గాలికి ఎగిరి కింద పడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదేవిధంగా మండలంలోని ఏ క్లాస్‌పూర్ గ్రామంలో బూడిద శంకరమ్మకు చెందిన ఇల్లు పైకప్పు పూర్తిగా కూలిపోయింది.

తాము పేద కుటుంబానికి చెందిన వారమని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితురాలు శంకరమ్మ వేడుకుంది. ఈ ఘటనలతో గ్రామాల్లో పలుచోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు నష్టాలపై పరిశీలన జరిపి సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply