Cricket Tournament | గ్రామీణ క్రీడాకారుల కోసం పోటీలు

Cricket Tournament | గ్రామీణ క్రీడాకారుల కోసం పోటీలు

  • క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత
  • రాష్ట్ర మంత్రులు పొన్నం, వివేక్

Cricket Tournament | కరీంనగర్ కల్చరల్, ఆంధ్రప్రభ : గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు పున్నం ప్రభాకర్, డాక్టర్ వివేక్ వెంకటస్వామిలు తెలియజేశారు. శుక్రవారం కరీంనగర్‌లో జిల్లాలోని అలుగునూర్ లో నిర్వహించిన కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు.

Cricket Tournament

అనంతరం మాట్లాడుతూ… గ్రామీణ క్రీడాకారులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, క్రీడాకారుల కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ క్రికెట్ ఆడిషన్ కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగమరావు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు కర్రి రాజశేఖర్ తోపాటు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply