Mahbubnagar తెలంగాణ సర్పంచ్ శక్తి సంఘ అవగాహన సదస్సు

Mahbubnagar తెలంగాణ సర్పంచ్ శక్తి సంఘ అవగాహన సదస్సు

కాంగ్రెస్ నేతల శిక్షణ శిబిరం

మహబూబ్‌నగర్ రూరల్‌( Mahbubnagar), ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండలోని ఓం కన్వెన్షన్‌లో తెలంగాణ సర్పంచ్ శక్తి సంఘం అవగాహన సదస్సు, ఒక్కరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, సర్పంచులు, డీసీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పార్టీ సిద్ధాంతాలు, విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RGPRS కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సుభాష్ యాకర్, ట్రైనర్స్ రాము, కరుణాకర్ రెడ్డి, తమిళనాడు సీనియర్ ట్రైనర్ సతీష్ కూడా పాల్గొన్నారు.

అనంతరం కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు చంద్రకుమార్ గౌడ్, మండల అధ్యక్షులు మహేందర్, అజ్మత్ అలీ, సాయిబాబా, రాములు యాదవ్, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ, దోమ పరమేష్, చందు యాదవ్, పలువురు డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply