పెద్ద బెల్లల్‌లో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదేశాల మేరకు కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో పెద్ద బెల్లల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తోట రాజేందర్, ఉపాధ్యక్షులుగా మైదం రమేష్, తాటికొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మెన గంగరాజం, కార్యదర్శులుగా ఆకుల రాజు, గంగినేని కిషన్, అధికార ప్రతినిధిగా మధుకర్, కోశాధికారిగా తాటికొండ రవి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పాడం ప్యాటా, చిన్నరాజం, జగ్గ రమేష్, పడిగెల రాజారత్నం, ఆకుల చిన్న గంగన్నలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ విశ్వాసాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేశ్ యాదవ్, కడెం మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముడికె మల్లేశ్ యాదవ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జడ రాజేశ్వర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముంజా ప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకాల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఈదుల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు తక్కల రాధ సత్తన్న, బీఎల్‌ఏ సభ్యులు తిరుపతి, సురేష్, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.