వాసవి క్లబ్‌ మండల అధ్యక్షుడిగా పల్లెర్ల శ్రీకాంత్

మునుగోడు, ఆంధ్రప్రభ: వాసవి క్లబ్ వి–102ఏ మునుగోడు నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏంఎస్‌ఆర్‌ బంక్వెట్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పల్లెర్ల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా గజ్జల నాగేష్,ప్రధాన కార్యదర్శిగా పామునిగుండ్ల నవీన్‌కుమార్, కోశాధికారిగా నీలా వెంకన్న ఎన్నికయ్యారు.

గౌరవ అధ్యక్షులుగా యడవల్లి సురేష్‌కుమార్,గార్లపాటి శ్రీను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశానికి క్లబ్ గవర్నర్ డాక్టర్ అల్లాడి పరమేశ్వర్,ముఖ్య అతిథి మార్యాల చంద్రమౌళి గుప్తా, క్యాబినెట్ కార్యదర్శులు ఉప్పల శ్రీనివాస్, విజయలక్ష్మి,రాష్ట్ర కోశాధికారి నర్సింహా, రీజినల్ చైర్‌పర్సన్ బాలమణి హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక సేవకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గజ్జల కిషన్,తడకమళ్ల భిక్షం, చిన్నస్వామి,ఈశ్వర్, మేడం శ్రీను,యాదయ్య, యాదగిరి,వీరశంకర్, నర్సింహా,సుభాష్, శ్రవణ్, కిరణ్,స్వాతి, విజయలక్ష్మి, సత్యవతి, విశాల, ఉమా, వాసవి, మాధవి, సరస్వతి, నీరజ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.