మనుమరాలితో కారు నడిపించిన ఎస్‌ఐపై కేసు నమోదు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: మైనర్ మనుమరాలితో కారు నడిపించిన ఘటనలో ఓ ఎస్‌ఐపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారి తిరుపతి అనే వ్యక్తి తన మైనర్ మనుమరాలికి కారు నడిపేందుకు అనుమతించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 125తో పాటు మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్లు 184, 180 కింద పూజారి తిరుపతిపై కేసు నమోదు చేశారు. ఆయన ఎస్‌ఐగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.