‘అక్కినేని కుటుంబంలో బెస్ట్ యాక్టర్ నువ్వే’..
అఖిల్‌పై ఆర్జీవీ ప్రశంసల జల్లు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. “‘లెనిన్’ సినిమా అద్భుతంగా ఉంది. అంతేకాదు, అక్కినేని కుటుంబంలో నువ్వే అత్యుత్తమ నటుడివని నేను నాగార్జునపై ఒట్టు పెట్టి చెబుతున్నాను. ఎలాంటి భావోద్వేగం లేని సన్నివేశాల్లోనూ నీ నటన ఎంతో సహజంగా ఉంది. ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే అదరగొట్టావు” అంటూ అఖిల్‌ను ఆకాశానికెత్తేశారు.
అలాగే ఈ చిత్ర దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరిని కూడా ఆర్జీవీ ప్రత్యేకంగా అభినందించారు. అఖిల్ తన నటనను అద్భుతంగా ప్రదర్శించేలా మంచి సన్నివేశాలను రూపొందించారని ప్రశంసించారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
