వర్షాల ముందే కీలక పనులకు వేగం.. గ్రామాలకు ఊరట

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పక్షం రోజుల్లో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మల్లేపల్లి సర్పంచ్ సత్యారాం కథలప్పఅన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి రహదారిపై రూ. 2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాలం వర్షాలు కురిస్తే బ్రిడ్జి లేకపోవడంతో వివిధ గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి, మక్తల్ మండల పరిధిలోని సోమేశ్వర బండ గ్రామాల ప్రజలు వర్షాకాలం వర్షాలు కురిస్తే రహదారిపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు పడుతున్న కష్టాలు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లగా రూ.2 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేపట్టినట్లు తెలిపారు. మంత్రి సహకారంతో నిధులు మంజూరు కావడంతో పక్షం రోజుల్లో పనులు పూర్తిచేసి వర్షాకాలంలో ఆయా గ్రామ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
