గ్రామంలో ఆరోగ్య సేవలు.. ప్రజల నుంచి విశేష స్పందన

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఉచిత వైద్య శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పగిడిమారి సర్పంచ్ ఎండి జాఫర్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పగిడిమర్రిలో నారాయణపేట శ్రీ సాయి కృష్ణ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం అభినందనీయమనిఅన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనిఅన్నారు. శ్రీ సాయి కృష్ణ ఆసుపత్రి నిర్వాకులను ఆదర్శంగా తీసుకుని పలు ఆసుపత్రిలో నిర్వాకులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదల ఆరోగ్యాన్నికాపాడాలన్నారు. వైద్య శిబిరం విజయవంతం కావడంతో వైద్య సిబ్బందిని సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రణతి, వంశీకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు మురళీధర్ రెడ్డి, ఘని,విష్ణుమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply