పిఓగా బాధ్యతలలు స్వీకరణ..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ నూతన ప్రాజెక్ట్ అధికారిగా మంద మకరందు (ఐఏఎస్ )ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ఆదివారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన హైదరాబాద్ జిహెచ్ఎంసి లోకల్ కమిషనర్ గా పనిచేసి బదిలీపై వచ్చారు. ఐటీడీఏ నూతన పీవో గా పూర్తి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జి పి ఓ గా పనిచేసిన ఉట్నూర్ సబ్ కలెక్టర్ ను ప్రభుత్వం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గా నియమిస్తూ బదిలీ చేశారు. నూతన పిఓ కు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ అధికారులు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.
