LIVE| ఇందిరా గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించిన రేవంత్ – మాచారం నుంచి ప్రత్యక్ష్య ప్రసారం

హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా నేడు ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రూ.12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిరా గిరి జల వికాస పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఇక పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 23 మంది చెంచు గిరిజన రైతులకు సౌర ప్యానెళ్లు , సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంతకుముందు, సీఎం రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు

తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులలో ఒకటైన ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ROFR పట్టాలు కలిగిన గిరిజనులకు ఈ పథకం వర్తించనుంది. వచ్చే ఐదేళ్లలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసింది. మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ పథకానికి మౌలిక ఉద్దేశం.

Leave a Reply