సీఐ సతీష్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డి. సతీష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
చౌటుప్పల్లోని సీఐ కార్యాలయంలో సంస్థాన్ నారాయణపూర్ మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన్నె నర్సింహారెడ్డి, మల్లెపల్లి ప్రముఖ్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, మల్లెపల్లి బుచ్చిరెడ్డి తదితరులు సీఐ సతీష్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ నాయకులు సీఐతో చర్చించారు.
