పంచాయతీల అభివృద్ది ద్యేయంగా పని చేస్తా..!
పంచాయతీల అభివృద్ది ద్యేయంగా పని చేస్తా..!
మాక్లూర్, ఆంధ్రప్రభ : మండల ఉప సర్పంచుల ఫోరం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఫోరం మండల అధ్యక్షుడిగా చిక్లి ఉప సర్పంచ్ బురోళ్ల సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా అరిఫ్, ప్రధాన కార్యదర్శిగా సతీష్, కోశాధికారీగా రమేష్ , ముఖ్య సలహాదారులుగా అరుణ్, చరణ్,సాగర్, హన్మంతు ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు బురోళ్ల సతీష్ తెలిపారు.
పంచాయతీల అభివృద్ది ద్యేయంగా, సమస్యల పరష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు స్పష్టం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
